Super Six : సూపర్ హిట్ విజయోత్సవ సభ.. కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం

సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ కావడంతో ఈ విజయోత్సవ సభ ప్రాధాన్యత సంతరించుకుంది.

Update: 2025-09-10 06:44 GMT

Super Six : సూపర్ హిట్ విజయోత్సవ సభ.. కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం

సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ కావడంతో ఈ విజయోత్సవ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈ సభ కోసం టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో అనంతపురానికి చేరుకున్నారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు మూడు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఈ సభకు హాజరుకానున్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే మాట ఒకే బాటగా కొనసాగుతూ ప్రజలకు మేలు చేసేలా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ సాధించారు. దీపం పథకం, మెగా డీ‌ఎస్సీ, తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, ప్రజలకు అందించిన సేవల గురించి ఈ సభ ద్వారా సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. అలాగే, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుందో కూడా చెప్పనున్నారు. రాష్ట్రాభివృద్ధి పట్ల తన చిత్తశుద్ధి, నిబద్దతను చాటుకోవడానికి సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల ప్రశంసలకు ఈ బహిరంగ సభ వేదిక కానుంది.


సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా నవ్యాంధ్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. అనంతపురం వేదికగా జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ‌సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం కానుంది. ఈ సభ ద్వారా కూటమి ప్రభుత్వం తమ 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల ముందుంచనుంది. కలిసి గెలవడమే కాదు.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, కలిసి పని చేస్తామని నిరూపిస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.సాధారణంగా ఎన్నికల ముందు పార్టీలు తమ హామీల గురించి చెప్తాయి. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ పాలనా విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు చెప్పడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం ఈ సభ ద్వారా ప్రజలకు దక్కుతోంది.


కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్ధికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. అప్పుల భారం, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సంక్షేమ పథకాల అమలులో కొన్ని అడ్డంకులు ఎదురైనా.. సీఎం చంద్రబాబుకు ఉన్న పాలనా అనుభవంతో వాటిని అధిగమించగలిగారు. చంద్రబాబు మొక్కవోని పట్టుదల అంకిత భావం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం వల్లే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సీఎం చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చి సుపరిపాలన దిశగా రాష్ట్రాన్నితీసుకు వెళ్లగలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది.


చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలు తక్కువ.. చేతలు ఎక్కువుగా చేసి చూపింది. కేవలం 15 నెలల్లో ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి లక్ష కోట్లకుపైగా వ్యయం చేయడమే.. కూటమి సర్కార్‌ చిత్తశుద్ధికి నిదర్శనం. సుపరిపాలన పెట్టుబడులకు భరోసా అనే నినాదం ఎన్నో సత్ఫలితాలను సాధించింది. మళ్లీ నవ్యాంధ్రకు అంతర్జాతీయ స్ధాయిలో ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చిందంటే అది చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైంది.

అనంతపురం సభ కేవలం ఒక రాజకీయ సమావేశం కాదు. ఇది రాష్ట్ర పునరుద్దరణకు అభివృద్ధికి, సుపరిపాలనకు సంకేతంగా నిలవనుంది. సాధారణంగా కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య సమన్వయం లోపించవచ్చని చాలా మంది భావిస్తారు. కానీ ఈ అనంతపురం సభ ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని చాటి చెప్పబోతున్నారు. కలిసి వచ్చాం.. కలిసి గెలిచాం.. కలిసి పని చేస్తాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే రీతిలో ఓ బలమైన సంకేతానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ వేదిక సూచికగా నిలవనుంది.


Tags:    

Similar News