Sunitha Reddy: సునీతరెడ్డి పిటిషన్ సెప్టెంబర్ 11కు వాయిదా

Sunitha Reddy: మూడు వారాల్లో రిజాయిండర్లు దాఖలు చేయాలని ఆదేశం

Update: 2023-07-18 14:12 GMT

Sunitha Reddy: సునీతరెడ్డి పిటిషన్ సెప్టెంబర్ 11కు వాయిదా

Sunitha Reddy: మాజీ ఎంపీ వై.ఎస్. వివేకా హత్య కేసులో సునీతరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. సునీత పిటిషన్ పై రిప్లయ్ ఫైల్ చేయాలని సీబీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదుంలందరికి నోటీసీలు జారీ చేసింది. మూడు వారాల్లో రిజాయిండర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీస్ ఫైల్ ఒరిజనల్ రికార్డులను సీల్డు కవర్ లో ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలని సీబీఐని ఆదేశించింది. కేసు డైరీ వివరాలను పిటిషనర్ కు ఇచ్చే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

Tags:    

Similar News