అఘాయిత్యానికి పాల్పడ్డ ఎస్ఐ లొంగుబాటు

మాన, ప్రాణాలను కాపాడే పోలీసులే కాలయములైతే ప్రజలు ఇక చేసేదేముంటుంది..

Update: 2020-06-14 05:52 GMT

మాన, ప్రాణాలను కాపాడే పోలీసులే కాలయములైతే ప్రజలు ఇక చేసేదేముంటుంది... అయితే ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి రాకపోగా, మరికొన్ని సంఘటనలు తప్పు చేసిన వారు పోలీసులైనా తప్పించుకునే అవకాశం లేకుండా చేస్తారు... అమరావతి ఎస్ఐ చేసిన ఘాతుకాలపై బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఎస్సైను అరెస్టు చేశారు.

అమరావతిలో లాడ్జీకి వచ్చిన జంటను డబ్బుల కోసం బెదిరించి, యువతిపై అఘాయిత్యానికి తెగబడిన "కీచక ఎస్సై" లొంగిపోయారు. తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ముందు లొంగిపోయిన రామంజనేయులు, అతని ప్రైవేటు డ్రైవర్‌ సాయికిృష్ణను రిమాండ్‌కు తరలించారు.

భాదితుల ఫిర్యాదు మేరకు కీచక ఎస్సై రామాంజనేయులుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లైంగిక వేధింపులు నిరూపణ అవ్వడంతో సస్పెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కీచక ఎస్సై గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే అమరావతి పోలీసస్టేషన్‌లో అతడిపై 354,354ఏ, 384,385, రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు

Tags:    

Similar News