పోలీసులు తనిఖీలు నూతన సంవత్సర ఎఫెక్ట్

వాహనం తీసుకుని బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. కాకినాడ నగరంలో ప్రతి రోజు నాలుగు ప్రదేశాలలో ట్రాఫిక్ పోలీసులు, మరో రెండు చోట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహన రికార్డులు తనిఖీ చేస్తున్నారు.

Update: 2019-12-14 08:17 GMT
ఎస్సై దానేటి రామారావు, ఏఎస్ఐ ప్రసన్నకుమార్

కరప: వాహనం తీసుకుని బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. కాకినాడ నగరంలో ప్రతి రోజు నాలుగు ప్రదేశాలలో ట్రాఫిక్ పోలీసులు, మరో రెండు చోట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు వాహన రికార్డులు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా పెనుగుదురు, నడకుదురు ప్రాంతాలలో కరప ఎస్సై దానేటి రామారావు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలకు సంబంధించి ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ తదితర ధ్రువీకరణ పత్రాలు ఉన్నది లేనిది పరిశీలిస్తున్నారు.

సాయంత్రం నడకుదురు మార్కెట్ కమిటీ వద్ద ఎస్ ఐ రామారావు బృందం తనిఖీలు జరిపింది. అనుమానితులను, అనుమా నిత వాహనాలను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించి రికార్డులు చూపిన అనంతరం విడిచి పెడుతున్నారు. కొన్ని వాహనాలకు చలాన్లు రాయడమే కాక వాహనచోదకులు డ్రైవర్లకు రోడ్డు భద్రత, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పిస్తున్నారు. వాహ నాలు నడిపేవారు నిబంధనలు పాటించాలని ఎస్ ఐ హెచ్చరించారు.

సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కేసులు పెడతామని హెచ్చరిం చారు. నూతన సంవత్సరం దగ్గరపడుతుండడంతో మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే తనిఖీలు ముమ్మరం చేశామని ఎస్సై రామారావు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జరిమానాలు కాకుండా న్యాయస్థానంలో హాజరు పరిచి జైలుకి పంపాల్సి ఉంటుందని హెచ్చరిం చారు. ఈ తనిఖీల్లో ఏఎస్ఐ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News