AP Street Vendors Business: పాక్షిక లాక్‌డౌన్‌తో చిరువ్యాపారుల ఇక్కట్లు

AP Street Vendors Business: కరోనా కాలంలో చిరువ్యాపారుల జీవితాలు చితికిపోతున్నాయి.

Update: 2021-05-13 08:38 GMT

Street Vendors  (File Photo)

AP Street Vendors Business: కరోనా కాలంలో చిరువ్యాపారుల జీవితాలు చితికిపోతున్నాయి. జీవనోపాధి విచ్ఛిన్నమవుతోంది. తెచ్చిన సరుకులు అమ్ముడుపోక.. నష్టాలు భరించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కరోనా ఏ ముహూర్తన అడుగుపెట్టిందో కానీ తమ జీవితాల్లో చీకట్లు నింపేసిందని బోరుమంటున్నారు. కరోనా వేళ చిరువ్యాపారుల కష్టాలపై ఫోకస్.

వీళ్లు చిరువ్యాపారులు. బతుకుబండి నడవాలంటే తోపుడు బండి నడపలి. పండ్లు, కూరగాయలు తీసుకువచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ఎండా, వాన ఏదచ్చినా.. భరిస్తూ బతుకెళ్లదీస్తారు.

సాఫిగా సాగుతున్న సిక్కోలు చిరువ్యాపారుల జీవితాల్లోకి కరోనా భూతం చీకట్లను నింపేసింది. గత ఏడాది దెబ్బకు చిరువ్యాపారులు ఇప్పటికీ కోలుకోలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మళ్లీ ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.

పొట్టి శ్రీరాముల మార్కెట్‌ను, తోపుడు బళ్లను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఇక నిలువ నీడలేక, ఎండల్లో గంటల తరబడి నిలబడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు. మిగిలిన సరుకును దాచుకోవడానికి గోడౌన్ కూడా లేదని వాపోతున్నారు.

ప్రస్తుతం ఏపీలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉంది. మధ్యాహ్నం 12గంటల వరకే వ్యాపారం చేసుకోవాలి. ఒక్కోసారి రోజంత వ్యాపారం చేసినా సరుకు అమ్ముడుపోదు. ఇప్పుడు పాక్షిక లాక్‌డౌన్‌తో పస్తులు తప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చిరు వ్యాపారులు.

Tags:    

Similar News