Nellore: నెల్లూరు జిల్లా జనసేనలో పెను తుఫాన్..?
JSP కీలక నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటికి వ్యతిరేకత..? 10 నియోజకవర్గ సమన్వయకర్తల అసంతృప్తి..? వేములపాటి తీరుపై పవన్ కల్యాణ్ అసహనం..? తాజా వివాదాలపై విచారణకు శివశంకర్ నియామకం త్వరలో సమగ్ర నివేదిక ఇవ్వనున్నశివశంకర్
Nellore: నెల్లూరు జిల్లా జనసేనలో పెను తుఫాన్..?
ఏపీ కూటమి పాలనలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు సింహపురిలో అసంతృప్తులు తారాస్థాయికి చేరాయట. గాజుగ్లాసులో పెను తుఫాను చెలరేగిందట. పార్టీ విధానకర్తల్లో ఒకరుగా.. క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌గా.. ప్రస్తుతం టిడ్కో చైర్మన్‌గా ఉన్న వేములపాటికి వ్యతిరేకంగా గాజు గ్లాసులో పెనుగాలి వీస్తోందట. పది నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొమ్మిది మంది ఇంచార్జులు ఏకతాటిగా ఆయనపైతిరుగుబాటు బావుటా ఎగరవేశారట. పార్టీలో అసంతృప్తిని.. అసమ్మతిని.. అధినేత దృష్టికి తీసుకెళ్లే దాకా వెళ్లిందట ఆ పరిస్థితి. సత్వరం స్పందించిన జనసేనాని సింహపురి జనసేనపై ప్రత్యేక గురి పెట్టారట. ఇంతకీ గాజు గ్లాసులో చెలరేగిన పెను తుఫాను ఏంటి..? వేములపాటిపై అసంతృప్తికి కారణాలేంటి..? కారకులెవరు..? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ JSP పొలిటికల్ సినారియో...
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. అటువంటి పార్టీలో ఇప్పుడు ఓ నేతపై నియోజకవర్గ స్థాయి నాయకులు నిప్పులు చెరుగుతున్నారట. ఒకరు.. ఇద్దరు కాదు ఏకంగా పది నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీలోనే క్రియాశీలక నేతగా ఎదిగిన ఏపీ టిడ్కో చైర్మన్ నెల్లూరు జిల్లావాసి వేములపాటి అజయ్ కుమార్‌పై తిరుగుబాటు బావుటా ఎగరవేశారట. అజయ్ తీరుతో అల్లాడిపోతున్నామంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారట ఉమ్మడి నెల్లూరు జిల్లా నియోజకవర్గ జనసేన నేతలు. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ గాజు గ్లాసు పార్టీలో పెను తుఫాను సృష్టిస్తోందట.
నెల్లూరు జిల్లా జనసేనలో తలెత్తిన.. పార్టీ అంతర్గత సంక్షోభంపై.. ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకయ ప్రకంపనలపై పూర్తి సమాచారం తెప్పించుకున్న జనసేనాని.. కేడార్‌ను రాజధానికి పిలిపించారట. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలు.. వేములపాటిపై తీవ్రస్థాయిలో అసమ్మతిని వెళ్లగక్కారట. మొత్తమ్మీద నెల్లూరు జిల్లా జనసేనలో నెలకొన్న సంక్షోభానికి పవన్ ఎండ్ కార్డు వేసే ప్రయత్నం చేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా, టిడ్కో చైర్మన్‌గా ఉన్న వేములపాటికి వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్చార్జిలందరూ తిరుగుబావుట ఎగురవేశారు. మొదటినుంచీ పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేసిన వారిని కాదని.. అజయ్ కుమార్ తన సొంత గ్రూపు తయారు చేసుకుంటున్నారంటూ ఇన్చార్జుల ఫిర్యాదుల పర్వం పెను తుఫానును తలపించిందట. దీంతో 9 మంది ఇన్చార్జులతోపాటు వీర మహిళలను జనసేన మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించారు. వారితో ప్రత్యేకంగా సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారట. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్ననేపథ్యంలో.. జిల్లా జనసేనలో నెలకొన్న తాజా సంక్షోభం తలెత్తడంతో పవన్ ఒకింత అసహనానికి గురయ్యారట. అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేస్తారా అంటూ గుస్సా అయ్యారట. సమావేశం ప్రారంభంలోనే నియోజకవర్గ ఇన్చార్జిలు, వీర మహిళలపై జనసేనాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే పార్టీ దృష్టికి తీసుకురావాలి గానీ మీడియాకు ఎక్కవద్దంటూ స్మూత్‌గా హెచ్చరించారట.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంగా వేములపాటి వ్యవహార శైలిపై ఒక్కొక్కరుగా పవన్‌కు చెవిలో వేశారట.తాము ఇన్చార్జులుగా ఉన్నప్పటికీ.. వేములపాటి సొంత వర్గాన్ని తయారుచేసుకుంటూ తమని దూరం పెట్టారనే ఆవేదన వ్యక్తపరిచారట. ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు పనులు చేయడం లేదని.. అందుకు అజయ్ కుమార్ అడ్డుగా ఉన్నారంటూ ఫిర్యాదు చేయడంతో పవన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ ప్రారంభం నుంచి కష్టకాలంలో వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటానని.. ఎవర్నీ దూరం చేసుకోనని పవన్ వారికి అభయం ఇచ్చారట. ఇకనుంచి ఎలాంటి సమస్యలూ ఉండవని.. మొదటి ప్రాధాన్యత నియోజకవర్గ ఇన్చార్జిలకే ఉంటుందని జనసేనాని హామీ ఇచ్చారట. ఈ క్రమంలో వేములపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. వెంటనే పార్టీలో ముఖ్యనేతగా ఉన్న.. తమ్మిరెడ్డి శివశంకర్‌కి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేనలో ఏం జరుగుతోందో నివేదిక ఇవ్వమని ఆదేశించారు.
తమ్మిరెడ్డి శివశంకర్‌ను త్వరలోనే నెల్లూరుకు పంపే అవకాశాలు ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్వరలో నెల్లూరు జిల్లా JSPలో నెలకొన్న సంక్షోభానికి కారకులెవరు..? ఎవరు పార్టీ అంతర్గత విషయాలను లీక్ చేస్తున్నారు..? అనే విషయాలపై తమ్మిరెడ్డి ఓ సమగ్ర నివేదిక ఇవ్వనున్నారాట. పదవులు పొందిన వారు.. జనసేనకు కాకుండా టిడిపికి అనుకూలంగా పనిచేయడంపై కూడా పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి పనిచేయాల్సిన నేతలందరూ.. వ్యక్తిగత స్వార్థాలు చూసుకుంటున్నారని.. అలాంటి వారితో పార్టీకి నష్టమని పవన్ వ్యాఖ్యానించారట. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తే.. పార్టీని బలహీన పరిచేలా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. తమ్మిరెడ్డి సమగ్ర నివేదిక తర్వాతైనా సింహపురి గాజుగ్లాసు పార్టీలో నెలకొన్న తుఫాను సమసిపోతుందా.. లేదా.. అనేది చూడాలి...