నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత.. కరోనా కట్టడిలో భాగంగా మూడు గ్రామాల ప్రజలు రాళ్లదాడి

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

Update: 2020-04-05 04:41 GMT
Nellore

నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల విషయంలో రాష్ట్రంలోనే నెల్లూరు టాప్ లో నిలిచింది. జిల్లాలోనే ఇప్పటివరకు 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో కరోనా ఎక్కువగా ఉండటంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. అయితే ఇదే అంశంపై మూడు గ్రామాల ప్రజల మధ్య గొడవ మొదలైంది. తమ గ్రామాల్లోకి ఇతర గ్రామాల వారు రావొద్దంటూ లక్ష్మీపురం, కొత్తూరు, విడవలూరు గ్రామస్తులు కంచెలు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే కంచెలు వేయడాన్ని కొందరు వ్యతిరేకించారు. దీంతో మూడు గ్రామాల మధ్యా గొడవ అంతకంతకూ పెరిగింది. రాళ్ల దాడి చేసుకునేవరకు పరిస్థితి వచ్చేసింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.

కరోనా వైరస్ ఊళ్ల మధ్య చిచ్చు రేపుతోంది. ఒక గ్రామం ప్రజలు మరో గ్రామానికి వస్తే వైరస్ తమ గ్రామాని సోకుతుందేమో అన్న ఉద్దేశంతో ఎవరికి వాళ్లు కంచెలు వేసుకున్నారు. కరోనా భయంతో అందరూ గుంపులుగా వెళ్లి దాడులు చేసుకున్నారు. ఎవరికైనా కరోనా వుంటే వ్యాప్తి చెందే అవకాశం వుంది. 

Tags:    

Similar News