Vizag Steel Plant: ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ప్లాంట్ సెగ
Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు
ఢీల్లీలో నిరసన తెలుపుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరింత ఉధృతమైంది. ఉద్యోగులు, కార్మికుల నిరసన సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనకు దిగారు ఉద్యోగులు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. కార్మికుల ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా రేపు ఏపీ భవన్‌లో ధర్నాకు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. ఎల్లుండి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కమిటీ నాయకులు కలవనున్నారు.