సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ)ను పునరుద్ధరిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2019-12-10 03:29 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ)ను పునరుద్ధరిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్‌ఐపీబీ ని పునరుద్ధరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనునారు.

ఎస్‌ఐపీబీ కన్వీనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యులుగా ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, రెవిన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మునిసిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయం మరియు సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు,

కార్మిక శాఖా మంత్రి జి. జయరాం, ఇండస్ట్రీ మరియు ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, అటవీ మరియు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి లను సభ్యులుగా నియమించారు. అలాగే ఈ సంబంధిత శాఖల కార్యదర్శులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఎస్‌ఐపీబీ ప్రతీ నెలా ఒకసారి సమావేశమై కీలకమైన పెట్టబడుల ప్రతిపాదనలను ఆమోదం తెలుపుతుందని ప్రభుత్వం వెల్లడించింది. కాగా రాష్ట్రంలో నూతన పెట్టుబడుల పర్యవేక్షణ ప్రస్తుతం మంత్రి గౌతమ్ రెడ్డి చూస్తున్నారు. అయితే పెట్టుబడులకు ఆమోదం తెలపడానికి ఈ శాఖల ఆమోదం తప్పనిసరి ఉంటుంది. అందులో భాగంగా గతంలో రద్దైన ఎస్‌ఐపీబీ ప్రస్తుతం సీఎం జగన్ పునరుద్ధరించారు.



Tags:    

Similar News