Tirumala: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్కరోజులోనే రూ.6.30కోట్లు
Tirumala: తిరుమల చరిత్రలో ఇదే అధిక ఆదాయం
Tirumala: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్కరోజులోనే రూ.6.30కోట్లు
Tirumala: తిరుమల చరిత్రలో హుండీ ఆదాయం రికార్డ్ బ్రేక్ చేసింది. శ్రీ వేంకటేశ్వరస్వామికి ఒక్కరోజులో హుండీ ఆదాయం 6కోట్ల 30లక్షలు రూపాయలు వచ్చింది. శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు. 2018 జులై 26న 6కోట్ల 28లక్షల రూపాయలు లభించింది. అదే రోజు సాధారణ హుండీ ఆదాయం 4కోట్ల 64లక్షలతో పాటు గతంలో ఉన్న నాణేలు లెక్కింపు ద్వారా వచ్చిన కోటి 64లక్షల ఆదాయాన్ని కూడా జమ చేయడంతో రికార్డు స్థాయిలో 6కోట్ల 28లక్షల రూపాయలు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. 2019 జులై 4న 6కోట్ల 18లక్షల ఆదాయం రావడంతో రెండవ రికార్డుగా నమోదు అయింది. అయితే వీటన్నిటికంటే తాజాగా 6కోట్ల 30లక్షల 96వేల 200 రూపాయలు లభించింది.