Srisailam: శ్రీశైల భ్రమరాంబికాదేవికి ఇవాళ కుంభోత్సవం

Srisailam: చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ లేదా శుక్రవారం నిర్వహణ...

Update: 2022-04-19 01:30 GMT

Srisailam: శ్రీశైల భ్రమరాంబికాదేవికి ఇవాళ కుంభోత్సవం

Srisailam: కుంభోత్సవ వేడుకకు శ్రీశైలం(Srisailam) ముస్తాబైంది. భ్రమరాంబికాదేవికి సాత్వికబలిని సమర్పించేందుకు సర్వం సిద్ధం చేశారు. లోకకల్యాణార్థం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి సాత్వికబలిగా సమర్పిస్తారు. అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జితసేవలను, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, ఏకాంతసేవ నిలిపివేస్తారు. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి సాత్వికబలిగా సమర్పిస్తారు.

చైత్రమాస ఉత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం, లేదా శుక్రవారం రోజు ఈ ఉత్సవాలను ప్రారంభించడం ఆనాయితీగా వస్తోంది. అమ్మవారికి ఒకప్పుడు ఇచ్చే జంతు బలికి బదులుగా సాత్విక పద్ధతిలో బలి నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.. ఈ ఉత్సవంలో గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు మాత్రమే అమ్మవారికి బలిహారంగా సమర్పిస్తారు. ఇక అమ్మవారికి భారీ ఎత్తున అన్నపు రాశితో నైవేద్యం సమర్పిస్తారు.

గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల సాత్విక బలి పూజలకు భక్తులు దూరమయ్యారు. ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీశైలం దేవస్థానం అధికారులు కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈ ఉత్సవాలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే వైదిక కార్యక్రమం మొదలుకానుంది. హరిహరరాయ గోపుర ద్వారం వద్ద కొలువుతీరిన మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి సాత్విక బలి కార్యక్రమం నిర్వహిస్తారు..

ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ మల్లికార్జున స్వామికి ప్రదోషకాల పూజ, అన్నాభిషేకం ఉంటాయి. ఈ పూజ అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షిణ మండపంలో అన్నపురాశిని పోసి స్త్రీ వేషధారణ ఉండే ఆలయ ఉద్యోగి అమ్మవారికి అన్నపురాశి నైవేద్యం గా సమర్పించి పూర్ణకుంభ హారతి ఇస్తారు. ఈ హారతితో సంప్రదాయంగా ఉత్సవం ప్రారంభం అవుతుంది.

కుంభోత్సవ వేళ స్వామి వారి కల్యాణం, ఆర్జిత సేవలతో పాటు ఏకాంతసేవ రద్దు చేసినట్టు వివరించారు. ఈ కుంభోత్సవంలో రెండు విడతలుగా అమ్మవారికి సాత్విక బలి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేవాదాయ చట్టం అమలులో భాగంగా పశు, పక్షులను ఆలయం వద్ద బలి ఇచ్చే విధానం పై నిఘా పెట్టినట్టు తెలిపారు... వామాచార బలి విధానం స్థానంలో ఆది శంకరాచార్యులు అఘోర తపస్సు చేసి రచించిన శివానందలహరి ఆధారంగా ఆమ్మవారి కుంభోత్స వేడుకలు నిర్వహించడం కోసం శ్రీశైలం దేవాలయ, రెవిన్యూ, పోలీస్ అధికారులు సర్వ సన్నద్ధం అయ్యారు...

ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. స్వామి, అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు శ్రీశైలం తరలి వస్తారు. శ్రీగిరి శివ నామస్మరణతో మార్మోగుతోంది. అమ్మవారి కుంభోత్సవానికి భక్తులు గుమ్మడి, నిమ్మ, కొబ్బరి కాయలు భారీ ఎత్తున తీసుకొని వస్తారు. 

Tags:    

Similar News