యువకుడి ప్రాణాలు తీసిన యాప్ లోన్

యువకుల అవసరాలను ఆసరా చేసుకుంటారు. ఒక్క క్లిక్‌తో లోన్ పొందే అవకాశం ఉందంటారు. మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపుతారు. అయితే.. వారి మాటలను నమ్మితే ఇంక అంతే సంగతులు.. తీసుకునేంత వరకు ఒకలా మాట్లాడతారు.

Update: 2020-12-18 06:00 GMT

యువకుల అవసరాలను ఆసరా చేసుకుంటారు. ఒక్క క్లిక్‌తో లోన్ పొందే అవకాశం ఉందంటారు. మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పంపుతారు. అయితే.. వారి మాటలను నమ్మితే ఇంక అంతే సంగతులు.. తీసుకునేంత వరకు ఒకలా మాట్లాడతారు.. తీసుకున్న తర్వాత మరోలా మాట్లాడతారు.. యాప్‌లోన్‌ల టార్చర్ భరించలేక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వారు చేసే పనికి మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యాప్‌ల వేధింపులు తట్టుకోలేక మొన్న సిద్దిపేటలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే.. శంషాబాద్ సైబరాబాద్ కమిషరేట్‌ పరిధిలో మరొకటి చోటు చేసుకుంది..

గుంటూరు మంగళగిరి ప్రాంతానికి చెందిన సునీల్.. హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా సమయంలో అతడి ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఊరికి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. దాంతో యాప్ లో లోన్ తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడక పోవడంతో.. లోన్‌ కట్టడంలో నిర్లక్ష్యం వహించాడు.. అంతే.. లోన్ ఏజెంట్లు టార్చర్ చేయడం మొదలు పెట్టాడు.

డబ్బులు కట్టాల్సిందేనని సునీల్ మీద ఒత్తిడి తెచ్చారు. సునీల్ వారి వేధింపులు తట్టుకోలేక పోయాడు. అంతేకాదు.. సునీల్ ఫోన్ నెంబర్ కంటాక్ట్ లిస్ట్‌ తీసుకుని.. డిఫాల్టర్ గా గుర్తించి.. అతడి పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేశారు.. దాంతో మనస్తాపానికి గురై సునీల్ అత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags:    

Similar News