అనకాపల్లిలో నాగుపాము బీభత్సం.. కానిస్టేబుల్ బైక్ సీటు కింద నుంచి విషసర్పం!
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నాగుపాము బీభత్సం బైక్ సీటు కింది నుంచి శబ్దం గమనించిన కానిస్టేబుల్ శివాజీ సీటు తెరిచి చూడగా బుసలు కొడుతూ నాగుపాము దర్శనం
అనకాపల్లిలో నాగుపాము బీభత్సం.. కానిస్టేబుల్ బైక్ సీటు కింద నుంచి విషసర్పం!
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నాగుపాము బీభత్సం సృష్టించింది. మొంథా తుఫాను ప్రభావంతో విషసర్పాలు బయటికి వస్తున్నాయి. కోటనందూరు పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ శివాజీ బైక్ సీటు కిందికి నాగుపాము దూరింది. విధులకు హాజరవ్వడానికి వెళ్తుండగా పాయకరావుపేట దగ్గరికి వచ్చేసరికి బైక్ సీటు కింది నుంచి శబ్దం రావడం గమనించాడు కానిస్టేబుల్. సీటు తెరిచి చూడగా పడగ విప్పి బుసలు కొడుతూ నాగుపాము దర్శనమిచ్చింది. పామును చూసిన కానిస్టేబుల్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. దాదాపు గంట పాటు సమయం వెచ్చించి పామును బయటకు తీసిన అనంతరం విధులకు హాజరైయ్యాడు.