తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Tirumala: స్మృతి ఇరానీకి వేదాశీర్వచనం చేసిన పండితులు.. తీర్థప్రసాదాలు అందజేసిన అధికారులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Tirumala: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమెకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా..అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్మృతి ఇరాని వెంట స్థానిక బీజేపీ నేతలు ఉన్నారు.