Visakha: తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారి దర్శనం
Visakha: భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అమ్మవారి అలంకరణ
Visakha: తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారి దర్శనం
Visakha: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు తొమ్మిదో రోజు మహిషాసురమర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. మహిషాసురుని వధించడం కోసం ఉగ్రరూపం ధరించిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి సందర్భంగా లోక కళ్యాణార్థం విశాఖ శ్రీ శారదాపీఠంలో చేపట్టిన రాజశ్యామల యాగం, కుంకుమార్చనలు, దేవీ భాగవత పారాయణ కొనసాగుతున్నాయి.