టిక్ టాక్‌తో ఉద్యోగాలు ఊడుతున్నా మార్పు రావడం లేదు. విధుల్లో ఉండగానే టిక్‌టాక్ చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. ఈ జాడ్యం తాజాగా ఏపీలోని శక్తి టీమ్స్‌కు అంటుకుంది. టిక్ టాక్ మోజులో పడి శక్తి టీమ్స్ విధులను గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచ్ డైలాగ్‌లతో టిక్‌టాక్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. జబర్ దస్త్ పంచులతో కామెడీ పండిస్తూ లేడీ కానిస్టేబుల్స్ చేస్తున్న టిక్ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసు వాహనంలోనే టిక్ టాక్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టిక్ టాక్ వీడియోలను స్టేటస్‌లో పెట్టుకుని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో రక్షణను గాలికి వదిలేశారంటూ మహిళా ఖాకీలపై విమర్శలు వస్తున్నాయి.