TTD: టీటీడీ విజిలెన్స్ అదుపులో ఇంటి దొంగ.. 42 వేలకు 6 వీఐపీ బ్రేక్ టికెట్ల విక్రయం

TTD: విచారణలో బయటపడ్డ శంకరయ్య పాత్ర

Update: 2023-07-06 03:30 GMT

TTD: టీటీడీ విజిలెన్స్ అదుపులో ఇంటి దొంగ.. 42 వేలకు 6 వీఐపీ బ్రేక్ టికెట్ల విక్రయం

TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లను బ్లాక్‌లో విక్రయించి విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డా  టీటీడీ ఉద్యోగి. తిరుపతికి చెందిన శంకరయ్య టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో మజ్జూర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన వేణుగోపాల్ వీఐపీ బ్రేక్ దర్శనం కావాలని శంకరయ్యను సంప్రదించాడు. ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 3 వేల విలువ కలిగిన 6 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను పొందిన శంకరయ్య... 42 వేలకు విక్రయించాడు. ఈ టికెట్లతో బుధవారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు చేరుకున్న వేణుగోపాల్ బృందాన్ని విజిలెన్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేశారు. విచారణలో శంకరయ్య పాత్ర బయటపడింది. దీంతో విజిలెన్స్ అధికారులు కేసును టూటౌన్ పోలీసులకు బదిలీ చేశారు.

Tags:    

Similar News