ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ నిర్వహణాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

Update: 2019-08-16 02:09 GMT

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బ్యారేజీ నిర్వహణాధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో తీవ్రంగా పెరిగింది. ఎగువ నుంచి 5,66,860 క్యూసెక్కుల నీరు వస్తుండగా, బ్యారేజీ నుంచి 5,65,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 50 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. 

Tags:    

Similar News