పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
* రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చిన ఎస్ఈసీ * మూడో దశ ఎన్నికలను రెండో దశకు మార్చిన ఎస్ఈసీ
SEC Ramesh (file image)
ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఎస్‌ఈసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. ప్రభుత్వం ఎన్నికలను సిద్ధం కాకపోవడంతో ఎస్‌ఈసీ రీషెడ్యూల్ విడుదల చేసింది. రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చింది. మూడో దశ ఎన్నికలను రెండో దశకు మార్చింది. నాలుగో దశ ఎన్నికలను మూడో దశకు మార్చింది. ఇక మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 29న నామినేషన్ స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.