చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ట్విస్ట్
* రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు * ఏకగ్రీవాలను పెండింగ్‌లో పెట్టాలని నిమ్మగడ్డ ఆదేశాలు * ఏకగ్రీవాల ఫలితాల ప్రకటనతో ముందుకెళ్లొద్దన్న ఎస్‌ఈసీ
(file image)
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కఠిన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ట్విస్ట్ ఇచ్చింది. రెండు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో ఏకగ్రీవాలను పెండింగ్‌లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ. ఏకగ్రీవాల ఫలితాల ప్రకటనతో ముందుకెళ్లొద్దన్న ఎస్‌ఈసీ. ఏకగ్రీవాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను కోరింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.