సుప్రీం తీర్పుతో ఎస్‌ఈసీ మరింత దూకుడు
* జిల్లా కలెక్టర్లతో రేపు నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ * ఎన్నికల షెడ్యూల్‌పై సీఎస్‌కు లేఖరాయనున్న ఎస్‌ఈసీ * నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ
SEC Nimmagadda Ramesh (file Image)
సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్‌ఈసీ మరింత దూకుడు పెంచారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇఫ్పటికే రీషెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ రేపు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, ఎన్నికల షెడ్యూల్‌పై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ రాయనున్నారు. మరోవైపు, ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ కేంద్రం సహకారం కోరారు. కేంద్ర సిబ్బందిని కేటాయించాలంటూ సెంట్రల్ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. ఆర్టికల్ 324 ప్రకారం కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు.