బ్రేకింగ్: ఏపీలో ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం: సీఎం జగన్

Update: 2020-05-19 09:15 GMT
YS Jagan (File Photo)

ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 3 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు- నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందని ఆదేశించారు. 9 రకాల సదుపాయలను అన్ని స్కూళ్లలో కల్పించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌ కూడా విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలని ఈ పనులపై కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలని సీఎం కోరారు. అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. 

Tags:    

Similar News