West Godavari: 365 రకాల వంటలతో కాబోయే అల్లుడికి ఆతిథ్యం
West Godavari: కాబోయే మనవరాలి భర్తను ఆహ్వానించిన తాతయ్య
365 రకాల వంటలతో కాబోయే అల్లుడికి ఆతిథ్యం
West Godavari: సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటలు వడ్డించి, మర్యాదలతో ముంచెత్తుతారు పశ్చిమగోదావరి జిల్లా వాసులు. కొత్త అల్లుళ్లకు అయితే ఆమర్యాదలే వేరు. అయితే నరసాపురంలో కాబోయే మనవరాలు భర్తను ఇంటికి ఆహ్వానించిన తాతయ్య 365 రకాల వంటలతో ఆతిథ్యమిచ్చారు. అవి కూడా వెజిటేరియన్ వంటలు మాత్రమే. మొత్తానికి కాబోయే అల్లుడికి అత్తమామలు 365 రకాల వంటకాలను రుచి చూపించారు.