Sankranthi celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో నేతలు పాల్గొంటున్నారు.

Update: 2021-01-13 09:28 GMT

representational Image

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో నేతలు పాల్గొంటున్నారు. జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేపడుతుందని చంద్రబాబు విమర్శించగా, ఓర్వలేక చంద్రబాబు భోగి మంటలేసుకున్నారని రోజా కౌంటర్ ఇచ్చారు. గతేడాది నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భోగి మంటల్లో దహనం అయి ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.

కృష్ణా జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వేడుకల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను ఆయన మంటల్లో వేసి దగ్ధం చేశారు. జగన్ ప్రభుత్వం పేదలు, రైతులపై భారం మోపుతుందని చంద్రబాబు విమర్శించారు.

చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబసభ్యులతో కలిసి వైసీపీ మ్మెల్యే రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు.ప్రజలందరూ భోగిమంటలేసి సంబురాలు చేసుకుంటుంటే చంద్రబాబు కడుపుమంటతో బోగి మంటలేసుకుంటున్నారు అని ఆమె విమర్శించారు. భోగి మంటల్లో కరోనా కాలి బూడిదవ్వాలని ఆకాంక్షించారు.

హైదరాబాద్ చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. కరోనా పోయి ఈ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

చిత్తూరు జిల్లా ఎ.రంగంపేటలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో మంచు కుటుంబసభ్యులు సందడి చేశారు. ఈ ఏడాది కరోనా నుంచి విముక్తి కావాలని దేవుళ్లను మోహన్ బాబు వేడుకున్నారు.భోగి మంటల వద్ద బంధుమిత్రులు మధ్య నేతలు ఉల్లాసంగా గడిపారు.

Tags:    

Similar News