Sand Prices Reduced in AP : శుభవార్త.. ఏపీలో ఇసుక ధరలు తగ్గనున్నాయి!

Sand Prices Reduced in AP: రాష్ట్ర ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ప్రజల అవసరాలకు ఇసుకను మరింత సులభంగా, చౌకగా అందజేయనుంది.

Update: 2020-07-17 08:15 GMT

Sand Prices Reduced in AP: రాష్ట్ర ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ప్రజల అవసరాలకు ఇసుకను మరింత సులభంగా, చౌకగా అందజేయనుంది. ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు జారీ చేయగా అవి ఈ రోజు (శుక్రవారం)నుంచి అమలులోకి రానున్నాయి.

ఇప్పటివరకూ ట్రాక్టర్‌ ఇసుకకు చలానాగా రూ.1300లు, లోడింగ్‌ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1000 నుంచి 1500లు మొత్తం రూ3500 నుంచి 4000 వరకూ వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1,300 భారం తగ్గనుంది. అయితే వీటికి సంబంధించిన పలు మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. నిబంధనలు ఇలా ఉన్నాయి.

ఇసుక కావాలి అనుకున్న వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్‌–1లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాత వినియోగదారుడి అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్‌–2లో పర్మిట్‌(సమయం, తేదీలతో)ను ఇస్తారు. రీచ్‌ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్‌ కచ్చితంగా ఉండాలి. ఒకేవేల 1నుంచి 3స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్‌ 4, 5 స్ట్రీమ్స్‌ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌యార్డుల ద్వారా సరఫరా చేస్తారు. ఇక ఇసుక పక్కాదారి పట్టకుండా చూసుకునే బాధ్యత గ్రామకార్యదర్శి పర్యవేక్షించాలి. 

Tags:    

Similar News