Sajjala: దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా?
Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.
Sajjala: దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా?
Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయించి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. విచారణకు హాజరుకావాలంటూ.. మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులపై సజ్జల స్పందించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో..లుకౌట్ నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారన్న సజ్జల.. అసలు..కేసు ముగిసే సమయానికి నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారు. సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చింది. అది కూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు?. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా?. దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా?. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.