Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగులను ఏనాడూ రాజకీయాలకు వాడుకోలేదు
Sajjala Ramakrishna Reddy: ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు అన్న భావన సీఎంకు లేదు
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగులను ఏనాడూ రాజకీయాలకు వాడుకోలేదు
Sajjala Ramakrishna Reddy: ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవాలి ఏనాడూ అనుకోలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణ రెడ్డి అన్నారు. ఉద్యోగులు వేరు ప్రభుత్వం వేరు అన్న భావన ముఖ్యమంత్రికి లేదన్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమే అని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి... పక్క రాష్ట్రాల్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని..కానీ సీఎం జగన్ మాత్రం..వెంటనే స్పందిస్తున్నారని సజ్జల తెలిపారు. ఆర్ధిక సమస్యలు ఎన్ని ఉన్నా..వాళ్ళ సమస్యలపై స్పందిస్తున్నామన్నారు. ఆనాడు చంద్రబాబు ఉద్యోగులను రాజకీయాలకు వాడుకున్నారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను చంద్రబాబు వెతుకుతున్నారని వివరించారు.