28న సహస్రపద్మహవనం -మహాలక్ష్మీ హోమం

శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ నందు ఈ నెల 28వ తేదీన విశాఖ శారదా పీఠాదిపతి ఆధ్వర్యంలో సహస్త్ర పద్మహవనం - మహాలక్ష్మీ హోమం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు

S. Srikanth
Updated on: 25 Nov 2019 2:01 PM IST
28న సహస్రపద్మహవనం -మహాలక్ష్మీ హోమం
X
మహాలక్ష్మీ హోమం

పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ నందు ఈ నెల 28వ తేదీన విశాఖ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో సహస్ర పద్మహవనం - మహాలక్ష్మీ హోమం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధిపతి చిట్టూరి వెంకట నరసింహారావు దంపతులచే శ్రీస్వరూపానందేంద్ర సరస్వతిస్వామికి అష్టోత్తరశత స్వర్ణ నాణెములతో పూజా కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అలాగే రెండు వేల మంది మహిళలతో లలితా సహస్ర నామ పారాయణ చేస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story