ఏపీలో అక్రమ మద్యంపై పోలీస్‌ ఉక్కుపాదం... రూ.3కోట్లకు పైగా విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం

Andhra Pradesh: మద్యం బాటిళ్లను రోడ్‌ రోలర్‌తో తొక్కించి ధ్వంసం

Update: 2022-06-16 07:12 GMT

ఏపీలో అక్రమ మద్యంపై పోలీస్‌ ఉక్కుపాదం... రూ.3కోట్లకు పైగా విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసం

Andhra Pradesh: జనరల్‌గా ఒక మద్యం బాటిల్‌ పగిలితేనే మందు బాబు గుండె తరుక్కుపోతుంది. అలాంటిది కొన్ని లక్షల కళ్లు చూస్తుండగా వేలాది మందు సీసాలను రోడ్‌ రోలర్‌లతో తొక్కించి, ధ్వంసం చేస్తుంటే ఆ మందు బాబుల బాధ వర్ణణాతీతం. అయ్యో మందు నేలపాలు అవుతోందని గుండెలు బాదుకుంటారు. సీసా ఖాళీ అయ్యే టైం లోనే అప్పుడే చుక్క అయిపోయిందా అని బాటిల్‌ను అటూ.. ఇటూ.. ఊపుతారు. అలాంటిది సరుకు ఇలా రోడ్‌ రోలర్‌ కింద పడి నలిగితే ప్రాణం విలవిలలాడదా..

ఏపీలో అక్రమ మద్యంపై పోలీస్‌ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ప్రకాశం జిల్లాలో గత మూడేళ్ళ కాలంలో అధికారుల దాడుల్లో 2 కోట్ల 14 లక్షల విలువైన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. 2019 నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ తెలంగాణ, గోవా, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 904 కేసుల్లో పట్టుబడ్డ భారీ మద్యం నిల్వలను రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదు చేసి రెండు వందల మంది నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు.

అటు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపంలో గత రెండేళ్లుగా పట్టుబడ్డ మద్యం సీసాలను ఒకచోట చేర్చి, ధ్వంసం చేశారు పోలీసులు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్‌స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 92 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్లను, సీజ్‌ చేసిన నాటుసారాను రాయచోటి పట్టణ పరిధిలోని వేంపల్లె రోడ్డులో రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. 

Full View


Tags:    

Similar News