Roja: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా

Roja: ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దుర్గగుడి అధికారులు

Update: 2022-10-05 09:53 GMT

Roja: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా



 




 


Roja: రాష్ట్ర ప్రజలు బాగుండాలని, సీఎం జగన్ ఇలాగే సుపరిపాలన అందించాలని దుర్గమ్మను వేడుకున్నానని మంత్రి రోజా వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మంత్రి రోజా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే టెంపుల్ టూరిజంపై ద్రుష్టి సారించామన్నారు. చాలామందికి తెలియని ఆలయాలను గుర్తించామని, పంచారామాలు, శక్తి పీఠాలు, గోల్డెన్ ట్రయాంగిల్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రతీ దేవాలయాన్ని సందర్శించేలా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని రోజా వెల్లడించారు.

మంత్రి రోజాకు దుర్గగుడి ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా మంత్రి ఆర్కే.రోజా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Tags:    

Similar News