Roja: త్వరలో విశాఖ నుంచే జగన్ పరిపాలన
Roja: ప్రతిపక్షాలపై మంత్రి రోజా విమర్శలు
Roja: త్వరలో విశాఖ నుంచే జగన్ పరిపాలన
Roja: త్వరలో విశాఖ నుంచి పరిపాల కొనసాగుతుందని వైసీపీ మంత్రులు తెలిపారు. ఈ మేరుకు వైసీపీ ప్రాంతీయ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ కార్యాలయ నిర్మాణానికి విశాఖలో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. ఒకప్పుడు సీఎం జగన్ పథకాలు తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అవే పథకాలు కొనసాగిస్తా అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాలంటరీ వ్యవస్థ వద్దన్న టిడిపి అధికారంలోకి వస్తే జగనన్నపథకాలు ఎలా కంటిన్యూ చేస్తుందని ప్రశ్నించారు. విశాఖ గర్జన టైం లో పవన్ కళ్యాణ్ కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేశారని మంత్రి ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పవన్‌కు షూటింగ్ గ్యాప్ దొరకలేదా అని సెటైర్లు వేశారు.