Narasapur Express: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీకి యత్నం
Narasapur Express: పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్ దగ్గర ఘటన
Narasapur Express: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీకి యత్నం
Narasapur Express: నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీకి విఫలయత్నం చేశారు దొంగలు. రైలుపై రాళ్లు రువ్వి.. చైన్ లాగి రైలులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బీ-1, ఎస్-11, ఎస్-12 కోచ్‌లలో దోపిడీకి యత్నించగా.. కోచ్‌లలో డోర్లు వేసి ఉండటంతో లోపలికి ప్రవేశించలేకపోయారు. పల్నాడు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ప్రయాణికుల నుంచి బంగారు చైన్లు లాక్కెళ్లారు. రాత్రి అదే తరహాలో మరోసారి రెచ్చిపోయారు. దీంతో.. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు.. వరుస ఘటనలపై దర్యాప్తు చేపట్టారు రైల్వే పోలీసులు.