చిత్తూరులో టెన్షన్ టెన్షన్: వ్యాపారిపై దొంగల కాల్పులు

Chittoor: చిత్తూరు గాంధీ రోడ్డులో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. చంద్రశేఖర్ అనే వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది.

Update: 2025-03-12 05:30 GMT

Chittoor: చిత్తూరు గాంధీ రోడ్డులో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. చంద్రశేఖర్ అనే వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. దొంగల ముఠా రెండు గాల్లోకి కాల్పులకు దిగారు.  .పోలీసులు రంగంలోకి దిగి మూడు గంటల పాటు  కష్టపడి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

అప్పుల పాలైన వ్యాపారి ఒకరు చంద్రశేఖర్ ఇంట్లో దోపీడీకి ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. అప్పులపాలైన ఆ వ్యక్తి ఆరుగురు వ్యక్తులతో కలిసి బుధవారం ఉదయం చంద్రశేఖర్ ఇంటికి చేరుకున్నారు. చంద్రశేఖర్ ను దుండగులు బెదిరించారు. తమ వెంట తెచ్చుకున్న డమ్మీ తొపాకులతో బెదిరించారు. అయితే ఇదే సమయంలో చంద్రశేఖర్ అదను చూసి దొంగలను ఇంట్లో వేసి బయట నుంచి తలుపులు వేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు చంద్రశేఖర్ ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. చంద్రశేఖర్ ఇంట్లో ఉన్న ఐదుగురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారిపోయిన మరో దొంగను పోలీసులు చిత్తూరు పట్టణ శివారులో అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News