విజయవాడలో అదుపు తప్పిన ఆర్టీసీ.. స్వర్ణప్యాలెస్ గోడను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా ఆగిన బస్సు

Vijayawada: రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును తొలగించిన పోలీసులు

Update: 2023-02-02 02:24 GMT

విజయవాడలో అదుపు తప్పిన ఆర్టీసీ.. స్వర్ణప్యాలెస్ గోడను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా ఆగిన బస్సు

Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో స్వర్ణప్యాలెస్ గోడను ఢీకొంది. ఈ ఘటనతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. తక్షణమే స్పందించిన గవర్నర్ పేట పోలీసులు ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును తొలగించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులున్నారు. ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

Tags:    

Similar News