Srikakulam: బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. నవ దంపతులు మృతి
Srikakulam: ఏవోబీ సరిహద్దు గొలంత్ర వద్ద రోడ్డుప్రమాదం
Srikakulam: బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. నవ దంపతులు మృతి
Srikakulam: ఏవోబీ సరిహద్దు గొలంత్ర వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో నవ దంపతులు మృతి చెందారు. ఇచ్చాపురం వాసి వేణు, ఒడిశా బరంపురం వాసి ప్రవళ్లికకు ఈ నెల 10న సింహాచలంలో వివాహం జరిగింది. ఈ నెల 12న వరుడు స్వగృహం ఇచ్ఛాపురంలో రిసెప్షన్ చూసుకొని అనంతరం అక్కడి నుంచి వధువు ఇంటికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న నవ దంపతులను వెనుకనుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నవ దంపతుల మృతితో పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.