Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Representational Image
Andhra Pradesh: ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని వెళుతోన్న భక్త బృందం అనూహ్య రీతిలో అనంతలోకాలకు ఎగిశారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరణించినవారు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.