Kakinada: డివైడర్‌ను ఢీకొని బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Kakinada: ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు

Update: 2023-03-19 04:00 GMT

Kakinada: డివైడర్‌ను ఢీకొని బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Kakinada: కాకినాడ జిల్లా తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు.

Tags:    

Similar News