కడప జిల్లా గుడిపాడులో ప్రమాదం.. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Kadapa: డోర్లు ఓపెన్ కాకపోవడంతో బస్సులోనే ఇరుక్కుపోయిన ప్రయాణికులు
కడప జిల్లా గుడిపాడులో ప్రమాదం.. అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Kadapa: కడప జిల్లా గుడిపాడులో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు కిందకు వెళ్లింది. అయితే ఆ సమయంలో డోర్లు ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోగా.. అద్దాలు పగలకొట్టి ప్రయాణికులను బయటకు తీశారు గుడిపాడు గ్రామస్తులు.