Road Accident: లారీని ఢీ కొట్టిన డీసీఎం.. 10 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
Road Accident: 60 మంది వలసకూలీలతో వెళ్తున్న డీసీఎం
Road Accident: లారీని ఢీ కొట్టిన డీసీఎం.. 10 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
Road Accident: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దేవరపల్లి డైమండ్ జంక్షన్ సమీపంలోని ప్లై ఓవర్ పై లారీని వెనక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. రాజమండ్రి నుంచి విజయవాడకు బొగ్గులోడ్‌తో వెళుతున్న లారీని డీసీఎం ఢీ కొట్టగా డీసీఎంలో ఉన్న 60 మంది వలసకూలీల్లో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం గోపాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.