భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ సహా బస్సులోని 20 మందికి తీవ్రగాయాలు
భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తుండగా.. అతివేగంగా బస్సును ఢీకొట్టిన టిప్పర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ సహా బస్సులోని 20 మందికి తీవ్రగాయాలు
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ దగ్గర ఆర్టీసీ బస్సు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును.. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉండగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.