Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bapatla: అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

Update: 2023-02-19 02:22 GMT

Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. డివైడర్‌ దాటి అవతలి రోడ్డులోకి వెళ్లిన కారును లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. కొరిశెపాడు మండలం మేదరమెట్ల దగ్గర హైవే పై ఈ ఘటన జరిగింది. అద్దంకి ఎస్‌ఐ‌ సమందర వలికి చెందిన కారుగా గుర్తించారు. మృతుల్లో ఎస్‌ఐ భార్య, కూతురుతో పాటు మరో ఇద్దరు మహిళలు, కారు డ్రైవర్ ఉన్నారు. భార్య, కూతురు మృతదేహాలను చూసి భోరున విలపించారు ఎస్‌ఐ వలి. కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News