బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం
Bapatla: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారంచేడు రోడ్డులోని ఫ్రేడ్ స్కూల్ వద్ద ఆర్టీసీ బస్సును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు గాయాలైయ్యాయి. గాయపడిన వ్యక్తులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.