Anantapur: కొత్తపేట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
Anantapur: మనీషాను స్కూల్‌కు తీసుకెళ్తుండగా ప్రమాదం
Anantapur: కొత్తపేట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
Anantapur: అనంతపురం జిల్లాలోని జాతీయ రహదారిపై విషాదం నెలకొంది. కొత్తపేట గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో రవి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తమ్ముడి కూతురు మనీషా అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గుత్తి మండలం గాజులపల్లి నుండి గుత్తికి విద్యార్థినిని స్కూలుకు తీసుకెళ్తుండగా కొత్తపేట గ్రామ సమీపంలోకి రాగానే.... డీజిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి బైకును ఢీకొంది. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు గాయపడ్డ మనీషాను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.