Anantapur: పత్తి కూలీల ఆటో బోల్తా, ఓ మహిళ మృతి
Anantapur: చెరువు గట్టు మలుపు తిప్పుతుండగా అదుపు తప్పిన ఆటో
Anantapur: పత్తి కూలీల ఆటో బోల్తా, ఓ మహిళ మృతి
Anantapur: పత్తి కూలీల ఆటో బోల్తాపడి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులో జరిగింది. వైటి చెరువు గ్రామానికి వెళుతున్న ఆటో గుత్తి చెరువు వద్ద మలుపు తిరుగుతూ అదుపుతప్పి బోల్తా పడింది. దాదాపు 15 అడుగుల లోతు ఉన్న గుంతలో పడిపోవడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో 19 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.