కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద జరిగింది. ప్రమాద స్థలంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానిక వ్యక్తులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.