Road accident at Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident at Gokavaram: తూర్పుగోదావరి జిల్లలో రోడ్డు ప్రమాదంలో వ్యాను బోలాపడి ఏడుగురు మృతి చెందారు.

Update: 2020-10-30 03:58 GMT

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తంటికొండ ఘాట్‌రోడ్డులో వ్యాన్‌ బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది గాయాల పాలయ్యారు. వీరిలో పలువురి పరిష్టితి విషమంగా వుంది. 


క్షతగాత్రులను పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది ప్రయాణికులు ఉన్నారు. తాటికొండలో వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం సంభవించింది. రాత్రి 3గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాజమండ్రి అర్బన్ ఎస్పీఘటనా స్ధలానికి చేరుకున్నారు. 


సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌రోడ్డులో పెళ్లి బృందానికి చెందిన మిని వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్.. మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్టు తెలుస్తోంది.రాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులు .కంబాల భాను (గోకవరం), సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం), ఎల్లా లక్ష్మీ (దివాన్ చెరువు), ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు), చాగంటి మోహిని (గాదారాడ), పచ్చకూరి నరసింహ (గంగంపాలెం) గా  గుర్తించారు. 

Tags:    

Similar News