ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణల తొలగింపు..ఆందోళన చేపట్టిన వ్యాపారులు

వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాలలో ఆక్రమంగా ఏర్పాటు చేసుకున్న బడ్డీలను తోలగించిన విషయం తెలిసిందే.

Update: 2019-12-17 08:54 GMT

చింతపల్లి: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థలాలలో ఆక్రమంగా ఏర్పాటు చేసుకున్న బడ్డీలను తోలగించిన విషయం తెలిసిందే. ఎన్నిమార్లు నోటిసులు ఇచ్చిన బడ్డిలను తియాని కారణంగా అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు.

గడచిన రెండేళ్లుగా చింతపల్లి గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసుకున్న ఆక్రమిత బడ్డీలను తొలగించాలని పలుమార్లు ఆయా శాఖల అధికారులు నోటీసులు ఇచ్చినా బడ్డీల యజమానులు స్పందించలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో బడ్డీలను ద్వంసం చేసి తొలగించారు. దీనిపై సంబంధిత బడ్డీల యజమానులు వ్యాపారాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించి నినాదాలు చేశారు.

Tags:    

Similar News