నేడు జగనన్న తోడు పథకం కింద రుణాలు, వడ్డీ మాఫీ నిధుల విడుదల

* సకాలంలో రుణాలు చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

Update: 2023-01-11 04:08 GMT

నేడు జగనన్న తోడు పథకం కింద రుణాలు, వడ్డీ మాఫీ నిధుల విడుదల

Jagan Anna Todu Neda: జగనన్న తోడు పథకం కింద సీఎం జగన్ నేడు రుణాలు, వడ్డీ మాఫీ నిధులు విడుదల చేయనున్నారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి రుణాలు, వడ్డీ మాఫీ నిధులు మంజూరు చేస్తారు. 6 నెలలకు సంబంధించిన 15.17 కోట్ల రూపాయల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌‌ను విడుదల చేస్తారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ సొమ్ము జమ చేయనున్నారు. ఒక్కొక్కరికీ 10 వేల రూపాయల చొప్పున 3.95 లక్షల మందికి రుణాలు మంజూరు చేస్తారు. బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్ల రూపాయల కొత్త రుణాలు మంజూరు చేయనున్నారు. చిరు వ్యాపారులకు 10 వేల రూపాయల వరకు ప్రభుత్వం వడ్డీ లేని రుణం అందించనునుంది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ చేయనుంది. 

Tags:    

Similar News