CM Jagan: ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల
CM Jagan: 12.77 లక్షల మందికి రూ.4,500.19 కోట్ల బ్యాంక్ రుణం
CM Jagan: ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్ విడుదల
CM Jagan: నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు బ్యాంక్ వడ్డీ రీయింబర్స్‌మెంట్ డబ్బులను అర్హుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఈ దఫాలో 4 లక్షల7 వేల 323 మంది లబ్ధిదారులకు బటన్ నొక్కి 46 కోట్ల 90 లక్షల రూపాయాల నిధులు విడుదల చేశారు. వీరంతా బ్యాంకుల దగ్గర 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నారని.. వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రీయింబర్స్‌మెంట్ చేస్తున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి ఏటా 2 విడతల్లో తమ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుందన్నారు సీఎం జగన్.