Tirumala: తిరుమలలో ఇవాళ కుండపోత వర్షం

Tirumala: రికార్డు స్థాయిలో మూడు గంటల పాటు కురిసిన వాన

Update: 2021-10-20 13:13 GMT

తిరుమలలో భారీ వర్షం (ఫైల్ ఇమేజ్)

Tirumala: తిరుమలలో ఇవాళ కుండపోత వర్షం కురిసింది. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఉరుములు, మెరుపులతో దాదాపు అర్థ గంటకు పైగా ఒక రకమైన వాతావరణం తిరుమలలో కనిపించింది. ఆ తర్వాత మొదలైన వర్షం సాయంత్రం 5 గంటల వరకు కుండపోతగా కురిసింది. ఇప్పటికే తిరుమలలో వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతుంటే. వాటర్ వర్క్స్ అధికారులలో ఆనందం అదేస్థాయిలో కనిపిస్తోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షాకాలంలో తిరుమలలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. రాయలసీమలో అత్యధిక వర్షపాతం తిరుపతిలోనే నమోదైంది. కరోనా పరిస్థితుల వల్ల మెరుగుపడిన భూ వాతావరణ స్థితి, తగ్గిన కాలుష్యం కారణంగా ఈసారి వర్షాకాలంలోరికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లెక్కలు తీస్తే దాదాపు ప్రతీ 36 గంటలకు ఒకసారి వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు.. అంతేకాదు. ఊహించిన సగటు వర్ష పాతం కంటే ఎక్కువగానే వర్షం కురిసినట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News